ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలుగు రాష్ట్రాలు మరోసారి సత్తా చాటాయి. ఈరోజు ప్రకటించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవగా.. తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. నేషనల్, ఇంటర్నేషనల్ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడానికి, రాష్ట్రాల మధ్య పోటీని సృష్టించడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం స్టేట్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ – 2019 ని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది.
2018 సంవత్సరంలో ఇలా ర్యాంకింగ్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. తాజా ర్యాంకింగ్ అంటే 2019కి గాను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగ్స్ ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, విమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ ర్యాంకింగ్‌ను విడుదల చేశారు. రాష్ట్రాల మధ్య వ్యాపారంలో పోటీతత్వాన్ని పెంచే ఉద్దేశంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ని రూపొందించారు. ఆర్థిక అభివృద్ధి, పరిపాలన, కార్మిక చట్టాల్లో చేపడుతున్న సంస్కరణల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయిస్తారు.