వారిని మెట్రో ప్రయాణానికి అనుమతించం : మెట్రో రైల్ ఎండి

-

అన్ లాక్ 4 కు అనుగుణంగా ఈ నెల 7 నుంచి మెట్రో సర్వీసులు పున: ప్రారంభిస్తున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ ఎం డి ఎన్ వీ ఎస్ రెడ్డి ప్రకటించారు. అన్ని కరోనా జాగ్రత్తలు తీసుకుంటునామన్న ఆయన రైల్లో, స్టేషన్ లో కూడా ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరని అన్నారు. మార్కింగ్ కు తగ్గట్టుగా ప్రయాణీకులు ఫాలో అవ్వాల్సి ఉంటుందని, నిత్యం స్టేషన్ పరిసరాలను శానిటైజ్ చేస్తామని ఆయన పేర్కోన్నారు. క్యాష్ లెస్ అంటే ఆన్ లైన్, స్మార్ట్ కార్డ్, క్యూ ఆర్ కోడ్ యూజ్ చేయాలని ఆయన అన్నారు.

ప్రతి 5 నిముషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంటుందన్న అయన రద్దీని బట్టి వేళల్లో మార్పులు చేర్పులు ఉంటాయని అన్నారు. ఫేస్ మాస్క్ తప్పనిసరని లేనివారు స్టేషన్ లో కొనుక్కోవాలని అన్నారు. ప్రతి ప్రయాణీకుడిని థర్మల్ స్క్రీనింగ్ చేస్తామని నార్మల్ టెంపరేచర్ ఉంటేనే అనుమతి ఇస్తామని అన్నారు. హ్యాండ్ శానిటైజర్ నిత్యం అందుబాటులో ఉంటుందని, మెటల్ ఐటమ్స్ లేకుండా మినిమం బ్యాగేజ్ తో రావాలని కోరారు. 75% ఫ్రెష్ ఎయిర్ ట్రైన్ లో అందుబాటులో ఉంటుందని దాని కోసం టెర్మినల్స్ వద్ద అక్కడక్కడ ట్రైన్ డోర్లు కొద్దిసేపు తెరిచి ఉంచుతామని అన్నారు. అంతే కాక ప్రతి స్టేషన్ లో ఐసోలేషన్ రూంల ఏర్పాటు చేసామని పేర్కొన్నారు>

Read more RELATED
Recommended to you

Latest news