బ్రేకింగ్ : ఏపీలో స్కూళ్లు, కాలేజీల ఓపెనింగ్ కి కొత్త షెడ్యూల్‌

-

ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ రీ ఓపెన్ పై గతంలో ఏపీ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఏపీలో నవంబర్ 2 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ చేస్తున్నామని పేర్కొంది. రెండు రోజులకు ఒకసారి క్లాసులు నిర్వహిస్తామని అప్పుడు ఏపీ ప్రభుత్వం తెలిపింది. 1,3,5,7 క్లాసులకు ఒక రోజు ఉంటుంది అని పేర్కొంది. 2,4,6,8 కి మరో రోజు ఉంటుందని పేర్కొంది. అదే స్కూల్ లో 750 మంది విద్యార్ధులు ఉంటే మూడు రోజులకు ఒకసారి క్లాసులను నిర్వహిస్తామని సిఎం జగన్ చెప్పారు.

అయితే ఇప్పుడు మళ్ళీ షెడ్యూల్ మార్చారు. నవంబర్ 2 నుంచి 9,10, ఇంటర్‌, డిగ్రీ క్లాసులు ప్రారంభం కానుండగా, నవంబర్ 23 నుంచి 6,7,8 క్లాసులు ఓపెన్ కానున్నాయి. ఇక డిసెంబర్ 14 నుంచి 1,2,3,4,5 తరగతుల వారికి స్కూల్ తెరుచుక్నున్నాయి. అయితే తల్లి తండ్రులు పిల్లలను స్కూల్స్ కి పంపడం ఇష్టం లేకపోతే ఆన్ లైన్ క్లాసులు కూడా ఉంటాయని అంటున్నారు. ఇక ఒంటిపూట బడులే అయినా మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతుందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news