50వేల మెజార్టీతో గెలిచిన ఆ ఎమ్మెల్యేని కేడర్ కూడా డేకట్లేదా…!

-

ఆయన అధికారపార్టీ ఎమ్మెల్యే. దాదాపు 50వేల మెజారిటీతో ఎన్నికల్లో గెలిచారు. ఇంకేముందీ చక్రం తిప్పేద్దామనుకున్నారు. కానీ ఏం లాభం.. కేడర్‌ కూడా పట్టించుకోవడం లేదట. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏడాదిన్నరగా తెగ ఫీలవుతున్నారట సదరు ఎమ్మెల్యే.

చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. చిత్తూరు జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా చర్చల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో ఓడినా.. 2019లో పుంజుకోవడంతో ఆయన అందరి దృష్టినీ ఆకరించారు. భారీ మెజారిటీ రావడంతో పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని.. అంతా తనదగ్గరకే వస్తారని అనుకున్నారట. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తలో కాస్త ఫర్వాలేదని అనిపించినా.. ఆ సంతోషం ఆవిరి అవడానికి ఆదిమూలానికి ఎంతో సమయం పట్టలేదని టాక్‌.

సత్యవేడులో ఆదిమూలం ఎంత కలుపుకొని వెళ్దామని భావించినా.. కేడర్‌ మాత్రం దూరం దూరం అని పక్కకు జరుగుతోందట. పైగా తాను అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా.. ఏ పని కావాల్సి వచ్చినా కార్యకర్తలు ఎవరూ రావడం లేదట. ఇది చేసిపెట్టండి అని అడిగేవారే లేరట. సత్యవేడులో ఏ పని జరగాలన్నా.. ఏం కావాలన్నా.. పార్టీ వారంతా జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరకు వెళ్తున్నారట. అందుకే ఎమ్మెల్యే ఆదిమూలాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news