ఏపీలో స్కూల్స్ ప్రారంభం మరో సారి వాయిదా పడింది. సెప్టెంబర్ 5న స్కూల్స్ ఓపెన్ చేయాలని ముందు ప్రభుత్వం భావించింది. కానీ కేంద్రం అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో అక్టోబర్ 5న విద్యాసంస్థలు ప్రారంభించాలని భావించారు. మళ్ళీ ఏమనుకున్నారో ఏమో ఆ డేట్ ని కూడా వాయిదా వేసినట్టు తెలుస్తోంది. నవంబర్ 2న స్కూళ్లు, కాలేజీలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అక్టోబర్ 5నే విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో నవంబర్ 2కు వాయిదా వేసింది ప్రభుత్వం. అయితే అక్టోబర్ 5న జగనన్న విద్యా కానుక పధకాన్ని మాత్రం ప్రారంభించనున్నారు అధికారులు. ఈ పధకం కింద అక్టోబర్ 5న విద్యార్ధులకు కిట్లు అందజేయనుంది ప్రభుత్వం. సీఎం జగన్ రాష్ట్రంలోని ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే కేంద్రం నుండి అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా అవి ఇంకా రిలీజ్ కాలేదు.