ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగాలు.. దరఖాస్తుకు గడువు తేదీ, జీతం, పోస్టుల వివరాలివే..!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయం ఉద్యోగాలకు గాను మొత్తం 13 విభాగాల్లో తాజాగా నోటిఫికేషన్లను జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీ వ్యాప్తంగా వేలాది ఉద్యోగాల్లో అభ్యర్థులు కొలువు దీరనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయం ఉద్యోగాలకు గాను మొత్తం 13 విభాగాల్లో తాజాగా నోటిఫికేషన్లను జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీ వ్యాప్తంగా వేలాది ఉద్యోగాల్లో అభ్యర్థులు కొలువు దీరనున్నారు. కాగా ఈ పోస్టులకు గాను జూలై 29 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. ఇక అభ్యర్థులు ఉద్యోగం పొందితే వారికి విభాగాన్ని బట్టి వేతనం రూ.14,600 నుంచి రూ.44,870 వరకు ఇస్తారు. దీంతోపాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

ap secretariat posts notification for 13 categories

ఈ ఉద్యోగాల్లో మొదటి రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ సమయంలో నెలకు రూ.15వేలు ఇస్తారు. పనితీరు బాగుందనిపిస్తే ఉద్యోగంలో కొనసాగిస్తారు. కాగా ఈ ఉద్యోగాలకు వయో పరిమితిని 18 నుంచి 42 సంవత్సరాల వరకు విధించారు. అదే ఎస్సీలకు అయితే 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు పరీక్ష ఫీజు రూ.200 మినహాయింపు ఉంటుంది. కానీ వారు రూ.200 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఈ ఉద్యోగాలకు గాను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో పరీక్ష తేదీకి 3 రోజుల ముందుగానే హాల్ టిక్కెట్లను పంపిస్తారు. ఇక ఈ ఉద్యోగాల్లో స్థానికులకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.

– ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులకు వేతనం రూ.14,600 నుంచి రూ.44,870 వరకు చెల్లిస్తారు. సెప్టెంబర్ 1న పరీక్ష ఉంటుంది. సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన వారు అర్హులు.
– విలేగ్ అగ్రికల్చర్ పోస్టులకు ఎంపికైన వారు గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీఈవోలుగా ఆత్మ ప్రాజెక్టులో పనిచేయాలి.
– పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6 డిజిటల్ అసిస్టెంట్ (కంప్యూటర్ ఆపరేటర్లు) పోస్టులకు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, బీసీఏ, ఎంసీఏ, ఐటీ ఇన్‌స్ట్రుమెంట్, డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి.
– విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పరీక్షకు హాజరయ్యే వారు బీఎస్సీ హార్టికల్చర్ లేదా బీఎస్సీ ఆనర్స్ డిప్లొమా కలిగి ఉండాలి.
– విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 3 పోస్టులకు నెలకు జీతం రూ.15వేలు చెల్లిస్తారు. డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, ఇంటర్ వొకేషనల్ కోర్సు చదివి ఉండాలి. పాలిటెక్నిక్ సివిల్ ఇంజినీరింగ్, బీఈ, బీటెక్ చదివిన వారు, లైసెన్స్‌డ్ సర్వే సర్టిఫికెట్ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
– యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ పోస్టులకు రెండు సంవత్సరాల యానిమల్ హజ్బెండరీ పాలిటెక్నిక్, ఇంటర్ వొకేషనల్ కోర్సు డెయిరీయింగ్, పౌల్ట్రీ కోర్సు చదివి ఉండాలి.
– విలేజ్ రెవెన్యూ అధికారి గ్రేడ్ 2 పోస్టుకు 10వ తరగతి లేదా ఐటీఐ డ్రాఫ్ట్స్‌మెన్ కోర్సు చేసిన వారు అర్హులు.
– పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
– వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news