సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం మరో స్పెషల్ లీవ్ పిటిషన్

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం మరో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. కేబినెట్ సబ్‌కమిటీ, సిట్ దర్యాప్తుపై ఇటీవల ఏపీ హైకోర్టు స్టే విధించడంతో.. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ సర్కార్‌ సుప్రీమ్‌ కోర్టును ఆశ్రయించింది. అమరావతిలో భూముల కొనుగోలు విషయంలో టీడీపీ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందని వైసీపీ ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సర్కార్ క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ నివేదికను ఇచ్చింది.

Supreme court verdicts are also given in Telugu from now

ఈ నివేదిక ఆధారంగా సిట్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సుమారు 4 వేల ఎకరాల్లో టీడీపీ నేతలు, కుటుంబసభ్యులు భూములు కొనుగోలు చేశారని తేల్చింది. తాజాగా అమరావతిలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ నెల 15వ తేదీన శ్రీనివాసరావు సహా 12 మందిపై కేసు నమోదు చేసింది. దీని మీద నిన్న ప్రభుత్వ న్యాయవాది మరో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌ వివరాలను ప్రచురించవద్దని, ప్రసారం చేయవద్దని మీడియాపై విధించిన నిషేధాజ్ఞలను కూడా ఎత్తివేయాలని కోరారు.