టెన్‌ ఫెయిల్‌ విద్యార్థులకు గమనిక.. నేటి నుంచే సప్లీమెంటరీ ఫీజులు

-

ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సోమవారం విడుదల చేశారు. విద్యార్థులు నేరుగా https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 4,14,281 మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే ఈ ఏడాది మొత్తం 6,15,908 మంది పరీక్షలు రాయగా.. 4,14,281 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అంటే దాదాపు 2 లక్షలకు పైగా (32 శాతానికి పైగా) విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు.

అయితే.. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు నెల రోజుల్లోపే సప్లీమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా తెలిపారు మంత్రి బొత్స. జూలై 6 నుంచి 15 తేదీ వరకు సప్లీమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా మంత్రి బొత్స పేర్కొన్నారు. సప్లీమెంటరీ రాసే విద్యార్థులకు ఈ నెల 13 నుంచి స్పెషల్ క్లాసులు పెడుతున్నామని, సప్లీమెంటరీ పరీక్షలకు సంబంధించి ఫీజును రేపటి నుంచే చెల్లించే అవకాశం కల్పిస్తున్నామని మంత్రి బొత్స వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version