ఆంధ్ర ప్రదేశ్ పదో తరగతి ఫలితాలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. కరోనా వల్ల పరీక్షలు రద్దు చేయటంతో విద్యార్థులందరూ ఉత్తీర్ణులు అయినట్లేనని ఏపీ విద్యార్థులకు ఈ సందర్భంగా తీపి కబురు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 2020, 2021 సంవత్సరాల్లో పదవ తరగతి విద్యార్థులకు మార్కులు, గ్రేడ్లు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు.
స్లిప్ టెస్టులకు 70%, ఫార్మాటివ్ ఎసెస్ మెంట్ కు 30% వెయిటేజ్ తో మార్కుల కేటాయింపులు ఇచ్చామని ఆయన తెలిపారు. ఛాయారతన్ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్న ఆయన… 6.28 లక్షల మంది విద్యార్థులు ఫలితాలు విడుదల చేయనున్నామరి వెల్లడించారు. ఎంసెట్ ర్యాంకింగులో ఇంటర్మీడియట్ కు ఇచ్చే 25 శాతం వెయిటేజ్ ఈ ఏడాది ఇవ్వడం లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా…గత వారమే ఇంటర్ ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిందే.