సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ఇటీవల నిర్వహించిన తన ఈవెంట్‌లోనే ఐఫోన్ 12 మోడల్స్ ను విడుదల చేస్తుందని భావించారు. కానీ అలా జరగలేదు. రెండు ఐప్యాడ్ మోడల్స్, కొత్త వాచ్‌లను యాపిల్ విడుదల చేసింది. అయితే అక్టోబర్ రెండో వారంలో ఐఫోన్ 12 ఫోన్లను యాపిల్ విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సారి కొత్తగా ఐఫోన్ 12 మినీ పేరిట ఓ నూతన తరహా ఐఫోన్ ను యాపిల్ విడుదల చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఐఫోన్ 12 మోడల్స్‌ను మొత్తం 4 రకాల వేరియెంట్లలో విడుదల చేస్తారని సమాచారం అందుతోంది. ఐఫోన్ 12, 12 మినీ, 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్ పేరిట మొత్తం 4 వేరియెంట్లను యాపిల్ ఈసారి విడుదల చేస్తుందని సమాచారం. కాగా ఐఫోన్ 12 మినీ ఫోన్ 5.4 ఇంచుల డిస్‌ప్లేను, ఐఫోన్ 12 ఫోన్ 6.1 ఇంచుల డిస్‌ప్లేను కలిగి ఉంటాయని సమాచారం. అలాగే ఐఫోన్ 12 ప్రొ 6.1 ఇంచుల డిస్‌ప్లేను, 12 ప్రొ మ్యాక్స్ 6.7 ఇంచుల డిస్‌ప్లేను కలిగి ఉంటాయని తెలిసింది. కాగా ఐఫోన్ 12, 12 మినీలలో ఎల్‌సీడీ డిస్‌ప్లేను, 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్‌లలో ఓలెడ్ డిస్‌ప్లేలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.
అయితే ప్రస్తుతానికి ఈ ఫోన్లకు సంబంధించిన వివరాలన్నీ ఆన్‌లైన్‌లో లీకైనవే. యాపిల్ ఇంకా వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అందువల్ల యాపిల్ విడుదల చేసే ఐఫోన్ 12 మోడల్స్ ఎలా ఉంటాయన్నది ఇప్పటికీ ఇంకా స్పష్టత రాలేదు. కానీ త్వరలోనే యాపిల్ దీనిపై ప్రకటన విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఇక కొత్త ఐఫోన్లలో 5జి ఫీచర్‌ను యాపిల్ అందిస్తుందని తెలుస్తున్నందున వాటి ధరలు కూడా భారీగానే ఉంటాయని సమాచారం అందుతోంది. ఈ వివరాలన్నీ తెలియాలంటే.. యాపిల్ నిర్వహించే మరో ఈవెంట్ వరకు వేచి చూడక తప్పదు.