MAA ELECTIONS : ‘మా’ ఎన్నికల అధికారి నియామకం

-

మా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రోజుకో మలుపు తో మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు… రసవత్తరంగా మారుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో… మా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల అధికారిగా అడ్వకేట్ కృష్ణమోహన్ ను నియామకం అయ్యారు. ఈ మేరకు ఆయనను అధికారిగా నియమిస్తూ… ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో… క్రమశిక్షణా సంఘం చైర్మన్ కృష్ణరాజు ఇండియాలో ఉండడం లేదు.

ఆయన విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎన్నికల బాధ్యతలు నిర్వహించడానికి శివకృష్ణ ను నియమిస్తూ కీలక ప్రకటన చేశారు నరేష్. బైలాస్ ప్రకారం ఎన్నికల అధికారిని నియమించి అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. అధికారిని నియమించి… నోటిఫికేషన్ విడుదల అయ్యాక మా అసోసియేషన్ కు సంబంధించిన రోజువారీ వ్యవహారాలు మరియు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి న పూర్తి బాధ్యత ఎన్నికల అధికారి. ఈ నేపథ్యంలో జీవి నారాయణరావును అసిస్టెంట్ ఎన్నికల ఆఫీసర్ గా నియమించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు అధ్యక్షుడు నరేష్.

Read more RELATED
Recommended to you

Latest news