ఏపీ నిరుద్యోగులకు జనవరి 1(రేపు) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంచి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-APPSC జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే అవకాశముంది. అంటే 2020 సంవత్సరంలో ఏఏ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలవుతాయన్న వివరాలను వెల్లడించనుంది. జనవరి 1న ఏపీపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ 2020 రిలీజ్ చేయనుంది. ఎగ్జామ్ క్యాలెండర్‌లో ఎగ్జామ్ పేరు, నోటిఫికేషన్ తేదీ, దరఖాస్తుకు ముఖ్యమైన తేదీలు, ప్రిలిమనరీ, మెయిన్ ఎగ్జామ్ తేదీలు ఉంటాయి.
జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఎంతో మేలు చేస్తుంది. ఏఏ పరీక్షలు ఎప్పుడు ఉంటాయో ముందే పూర్తి సమాచారం ఉంటుందని కాబట్టి… వాటికి తగ్గట్టుగా అభ్యర్థులు తమ ఎగ్జామ్ ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకుంటారు. అంతేకాదు… ఏపీపీఎస్సీ నిర్వహించబోయే నియామక ప్రక్రియలో పరీక్షలు మాత్రమే ఉంటాయని, ఇంటర్వ్యూలు ఉండవని ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. కాగా, జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబర్‌లోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రేపు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనున్నారు.