ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలంతా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, విశాఖను రాజధాని చేయాలనే ప్రతిపాదనను టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వాగతించడం చర్చనీయాంశమైంది. పార్టీ స్టాండ్ కు విరుద్ధంగా గంటా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. దీంతోపాటు టీడీపీలో ఆయన కొనసాగుతారా? లేదా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు.
ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నానని గంటా తెలిపారు. విశాఖ వాసిగా.. 30 ఏళ్లు రాజకీయాలతో నగరంలో అనుబంధం ఉందన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసే అవకాశం విశాఖ కల్పించిందని.. అందుకే ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. విశాఖవాసులుగా మద్దతు ఇచ్చానన్నారు. అంతే తప్ప పార్టీ మారే ఉద్దేశం లేదన్నారు. మీడియా మిగతా విషయాల్ని పక్కన పెట్టి రాజధానికి మద్దతిచ్చానన్న అంశాన్నే హైలెట్ చేస్తుందన్నారు గంటా.