క్రిష్ణవంశీ అన్నం సినిమాకి రెహమాన్ సంగీతం..?

-

మహాశివరాత్రి రోజున అందరూ ఆశ్చర్యపోయేలా సినిమా ప్రకటించేసాడు క్రిష్ణవంశీ. ప్రస్తుతం రంగమార్తాండ సినిమా పనుల్లో ఉన్న క్రిష్ణవంశీ, ఆ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా డైరెక్టుగా మరో సినిమాని ప్రకటించడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలకి తెర తీసింది. అన్నం సినిమాలో ఎవరు నటిస్తున్నారనే విషయం ఇంకా తేలనే లేదు. మొదటగా చిరంజీవి నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి కానీ, అవి నిజం కాదని తెలిసిపోయింది. అదలా ఉంటే, తాజా సమాచారం ప్రకారం అన్నం సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడంటూ వార్తలు జోరందుకున్నాయి.

అవును, అన్నం సినిమాకి టాప్ టెక్నీషియన్ రెహమాన్ పని చేయబోతున్నట్లు వినిపిస్తుంది. ఈ విషయమై అధికారిక సమాచారం బయటకి రానప్పటికీ, రెహమాన్ పేరు బయటకి రావడంతో అన్నం సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని అర్థం అవుతుంది. మరి రెహమాన్ సంగీత దర్శకుడనే విషయం నిజామా కాదా అన్నది క్రిష్ణవంశీ వెల్లడి చేస్తేనే కానీ అధికారికంగా బయటకు తెలియదు.

Read more RELATED
Recommended to you

Latest news