ఏ ఆర్ రెహమాన్ కొడుకుకి తృటిలో తప్పిన ప్రమాదం.. ఘోరమైన ప్రమాదం..!

-

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోని ఆయనకు సంబంధించిన ఏ విషయమైనా సరే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఆయన కుమారుడు ఏ.ఆర్.అమీన్ కి షూటింగ్ సెట్లో తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ఈ విషయం కాస్త చాలా వైరల్ గా మారింది. దాంతో అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు..

అమీన్ తన బృందంతో కలిసి కెమెరా ముందు పెర్ఫార్మ్ చేస్తుండగా పైన వేలాడుతున్న భారీ షాండలియా ఉన్నట్టుండి ఊడి కింద పడింది. ఆ సమయంలో ఏ ఆర్ అమీన్ అండ్ టీం అంతా అదే వేదికపై ఉన్నారు. వేదికపై భారీ క్రేన్ సహాయంతో వేలాడదీసిన ఈ షాండలియా సెటప్ ఎవరు ఊహించని విధంగా ఒక్కసారిగా ఊడి కింద పడిపోవడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. అయితే షాండలియా సెటప్ వేదికపైనే కింద పడిపోయినప్పటికీ అక్కడ ఎవరికి ఎలాంటి హానీ జరగకపోవడంతో అమీన్ తో పాటు అక్కడున్న ఆయన బృందం అందరూ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఏమాత్రం అటు ఇటు అయినా వారి తలలు పగిలేవేమో.. అయితే అదృష్టవశాత్తు అలాంటిదేమీ జరగలేదు.

ఈ ఘటన జరిగి మూడు రోజుల అవుతోంది. అయితే ఇప్పటివరకు తాను ఆ షాక్ లో నుంచి తేరుకోలేకపోతున్నాను అంటూ అమీన్ తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అప్లోడ్ చేసి ఆ చేదు ఘటనను అభిమానులతో పంచుకున్నాడు. తల్లిదండ్రులు , ఆ దేవుడు, అభిమానులు, శ్రేయోభిలాషుల ఆశీర్వాదం వల్లే తాను ఇలా బ్రతికి ఉన్నానని లేదంటే ఘోరం జరిగిపోయి ఉండేదని చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. అమీన్ షేర్ చేసిన ఫోటోలను చూస్తుంటే ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉండేదో ఇట్టే అర్థమవుతుంది. ఏది ఏమైనా భగవంతుడి వల్ల ఏ అనర్ధం జరగలేదని అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version