న్యూ ఇయర్ సందర్భంగా మద్యం బాబులు మందును ఊదేస్తారు అనేది అందరికి తెలిసిందే. అయితే గత 5 ఏళ్ళు ఏపీలో సరైన మందు దొరకక ఇబ్బంది పడిన మద్యం బాబులు.. ఈ 2025 న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా భారీ ఎత్తులో మందు ను ఊదేశారు. ఈయర్ ఎండింగ్ 30, 31 రెండు తేదీల్లో ఏపీ వ్యాప్తంగా 331.84 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
అయితే 31వ తేదీ కంటే 30వ తేదీన భారీగా మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తుంది. 30 వ తేదీన 219 కోట్ల అమ్మకాలు జరిగితే.. 31 వ తేదీన 113 కోట్ల అమ్మకాలు జరిగాయి. అయితే చివరి రోజు మందు దొరుకుతుందో లేదో అని ముందు రోజే కొన్నట్లు అర్ధం అవుతుంది. అలాగే రెండు రోజుల్లో 408296 కేసుల లిక్కర్ అమ్మకాలు జరగ్గా.. ఆ చివరి రెండు రోజుల్లో 161271 బీరు కేసులు అమ్ముడు అయ్యాయి. అయితే ఏపీ వ్యాప్తంగా ఉన్న వైన్ షాప్స్, బార్లలో ఈ అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ చెబుతుంది.