అంగ‌రంగ వైభవంగా జ‌రిగిన వైసీపీ ఎంపీ వివాహం..

కేవ‌లం 26 సంవత్సరాల వయసులోనే పార్లమెంట్ లో అడుగుపెట్టి, దేశమంతటినీ ఆకర్షించిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నిన్న రాత్రి శరభన్నపాలెంలో తన చిన్ననాటి మిత్రుడు శివప్రసాద్‌ వైసీపీ ఎంపీ మాధవి వివాహం జ‌రిగింది. ఈ పెళ్లికి బంధుమిత్రులతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. మేళతాళాలు, రంగు రంగుల విద్యుత్‌ దీపాల నడుమ సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది.

మాధవి స్వగ్రామమైన కొయ్యూరు మండలం శరభన్నపాలెంలోనూ, ఇటు వరుడు శివప్రసాద్‌ స్వగ్రామం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గురువారం రోజంతా సందడి వాతావరణం నెలకొంది.ఇక‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుతో పాటు పార్టీ నేతలు ఎంపీ మాధవిని ఆశీర్వదించారు. అలాగే వీరిద్దరి మ్యారేజ్ రిసెప్షన్, ఈ నెల 22న రుషికొండలోని సాయిప్రియ బీచ్ రిసార్టులో జరుగనుంది.