బ్రేకింగ్‌: ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్ధామరెడ్డి అరెస్టు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 14వ రోజుకు చేరుకుంది. అయితే హైదరాబాద్ సుందరయ్య విజ్నాన కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్ధామ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రేపటి బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ జేఏసీ బైక్ ర్యాలీ చేపట్టింది. ర్యాలీని అడ్డుకుని అశ్వర్ధామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

ఆయనతోపాటు ఆర్టీసీ జేఏసీ సహ కన్వీనర్‌ రాజిరెడ్డి వెంకన్నలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మొండి వైఖరని వీడి, కార్మికులతో చర్చలు జరపాలని కోరారు. ఆర్టీసీ సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలను కోరారు.