కరోనా వైరస్ నేపధ్యంలో ప్రజలకు ఆర్ధిక కష్టాలు అనేవి తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ప్రజలకు ఆర్ధిక వెసులుబాటు కల్పించే ప్రయత్నాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ప్రజలకు ఇప్పటికే ఆర్ధిక సహాయం ప్రకటించి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాయి. అయితే ఇక్కడే బ్యాంకు లు ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇప్పుడు వ్యక్తమవుతున్న అనుమానాలు ఏంటీ అనేది చూస్తే…
ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఆర్ధిక సహాయంలో కోత విధించే అవకాశం ఉంది. జనధన ఖాతాల్లో దాదాపు 2 నుంచి 3 కోట్ల ఖాతాలు వాడుకలో లేవు. వాటికి నిర్వహణ చార్జీలను వసూలు చేసే అవకాశం ఉంది. నగదు జమ చేయడానికి గానూ ఆ ఖాతాలను మళ్ళీ యాక్టివ్ చేసాయి బ్యాంకు లు. ఈ క్రమ౦లోనే వాటి మీద ఇప్పుడు చార్జీల బాదుడు ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
40 రూపాయల నుంచి 200 వరకు ఇప్పుడు చార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వేస్తుంది గాని లేకపోతే ఆ ఖాతాలు వాడే అవకాశం ఉండదు. అందుకే ఇదే మంచి తరుణం అని భావిస్తున్న బ్యాంకు లు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులో కొంత కట్ చేసే అవకాశం ఉందని, ఏటీఎం సహా కొన్ని చార్జీలను వసూలు చేస్తారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై కేంద్రం ఎం అంటుందో చూడాలి.