పిల్లలు స్మార్ట్ ఫోన్ లో మునిగిపోతున్నారా..? అయితే వీటిని అనుసరించాల్సిందే…!

-

తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోలేక విసిగిపోతూ వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ని బాగా అలవాటు చేస్తున్నారు. ఆ తర్వాత పిల్లలు అస్సలు స్మార్ట్ ఫోన్ ని వదలడం లేదు దానిలోనే మునిగిపోతున్నారు. మీరు కూడా పిల్లలకి స్మార్ట్ ఫోన్ ని బాగా అలవాటు చేసేసారు..? మీ పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారా..? అయితే ఇది మీ కోసం. స్మార్ట్ ఫోన్ నుండి పిల్లల్ని దూరం పెట్టాలంటే తల్లిదండ్రులు ఇలా ఫాలో అయితే సరిపోతుంది.

 

పిల్లలతో కాలక్షేపం చెయ్యండి:

చాలామంది తల్లిదండ్రులు బాగా బిజీ అయిపోతున్నారు దీనివల్ల పిల్లలతో సమయాన్ని గడప లేకపోతున్నారు అలా కాకుండా తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని స్పెండ్ చేస్తే అప్పుడు కచ్చితంగా వాళ్ళు స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉండగలరు.

వీడియో కాల్ కి దూరంగా ఉంచండి:

పిల్లల్ని బంధువులతో ఎక్కువగా వీడియో కాల్ ద్వారా మాట్లాడిస్తూ ఉంటారు నిజానికి ఆ అలవాటు మీ పిల్లలకి ఉంటే దానిని మాన్పించండి. వీడియో కాల్ ద్వారా కాకుండా స్వయంగా వారితో మాట్లాడితే వాళ్ళు స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉండగలుగుతారు.

వారిచేత ఆటలు ఆడించండి:

పిల్లలు బయట ఆటలు ఆడేందుకు ప్రోత్సహించాలి అంతేకానీ సెల్ ఫోన్ అలవాటు చెయ్యొద్దు.

స్మార్ట్ ఫోన్ పై అవగాహన కల్పించండి:

స్మార్ట్ ఫోన్ వల్ల కలిగే అనర్ధాలు పిల్లలకు చెప్పడం కూడా చాలా ముఖ్యం దానివల్ల కూడా పిల్లలు స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉండగలరు. పిల్లలు కనుక మొండి చేస్తున్నట్లయితే మీరు ఫోన్ పాస్వర్డ్ మార్చండి. దాంతో వాళ్లు ఫోన్ లాక్ తెలియక దూరంగా ఉండగలుగుతారు. అలాగే చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ఫోన్ ఇచ్చి అన్నం తినిపిస్తూ ఉంటారు ఆ తప్పును కూడా చేయకుండా వారితో మాట్లాడుతూ వాళ్ళకి పెట్టండి ఇలా నెమ్మదిగా చిన్న చిన్న మార్పులు చేస్తూ పిల్లల్ని ఫోన్లకు దూరంగా ఉంచచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news