ఇప్పుడు దేశ వ్యాప్తంగా మిడతల దండు భయం రైతులను బాగా ఇబ్బంది పెడుతుంది. అసలే 2020 లో వ్యవసాయం సరిగా లేక ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ మిడతల దండు వ్యవహారం పెద్ద తల నొప్పిగా మారింది. ఇరాక్ ఇరాన్, పాకిస్తాన్ నుంచి కొన్ని కొట్లలో మిడతల దండు వచ్చేసింది. రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాలను ఈ మిడతల దండు కమ్మేసింది. సామాన్య ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు.
అవి ఏది తింటాయి అనేది పక్కాగా చెప్పలేరు గాని… పచ్చదనం ఉన్న చోట అవి వాలితే మాత్రం అక్కడ పచ్చదనం అనేది దాదాపుగా కనపడదు. వాటి సంతాన ఉత్పత్తి చాలా ఎక్కువ కాబట్టి ఇప్పుడు అవి ఎక్కడ వాలినా సరే నాశనమే. ఇప్పుడు వాటిని తోలడానికి చాలా మంది పురుగుల మందులను పిచికారి చేస్తున్నారు. కొన్ని చోట్ల డప్పులు మోగించడం, పాటలు పెద్ద సౌండ్ తో పెట్టడం వంటివి చేస్తున్నారు.
అయితే వాటికి సంతాన ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని వాటిని తోలడం కంటే మనుషులు తినడమే మంచిది అని ఆస్ట్రేలియా కి చెందిన పరిశోధకులు చెప్తున్నారు. వాటిని తింటే చాలా వరకు ప్రోటీన్ లు మనిషికి లభిస్తాయని అంటున్నారు. చరిత్రలో చాలా దేశాలు వీటిని ఆహారంగా తిని, బెడదను తగ్గించుకున్నాయని, దక్షిణ అమెరికా దేశాలు వాటిని ఎదుర్కోవడానికి ఈ మార్గాన్ని అనుసరించాయి కాబట్టి భారతీయులు కూడా అదే చెయ్యాలని సూచిస్తున్నారు.