తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రచారం చేయకపోవడం పక్కనబెడితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం చేయకపోవడం మాత్రం టిఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ఇబ్బందికర వాతావరణమే. వీళ్ళిద్దరికీ ఖమ్మం జిల్లాలో మంచి బలగం ఉంది. నాగేశ్వరరావుకి అయితే హైదరాబాదులో కూడా మంచి వర్గం ఉంది.
నల్గొండ జిల్లాలో కూడా అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. కనీసం ఆయన ఒక్క సభలో కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. కనీసం ప్రచారంలో మంత్రులందరూ పాల్గొంటున్న సరే ఆయన మాత్రం ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. కనీసం టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలంటూ తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడా కూడా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయన వర్గం అంతా కూడా ఖమ్మం జిల్లాలో సైలెంట్ గా ఉంది.
ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ కుమార్ పెత్తనం ఎక్కువగా నడుస్తుండటంతో దాదాపుగా తుమ్మల సైలెంట్ గానే ఉంటున్నారు. దీని కారణంగా పార్టీ ఎక్కువగా నష్టపోయింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో టిఆర్ఎస్ పార్టీలో కొంతమంది నేతలకు పొసగడం లేదు. దీనితో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సైలెంట్ గానే ఉన్నారు. ఇక తనకు రాజ్యసభ సీటు వస్తుందని లేకపోతే ఎమ్మెల్సీ సీటు వస్తుందని ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కనీసం గవర్నర్ కోటాలో అయినా సరే తనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తారని ఆయన భావించారు. కానీ ఏదీ జరగకపోవడంతో ఇప్పుడు ఆయన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూకుడు కనపడలేదు. దీనితో ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాల్లో టిఆర్ఎస్ పార్టీ భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.