వాట్సాప్ లో మీరు ఈ తప్పు చేస్తున్నారా..? అయితే మీ అకౌంట్ బ్లాక్ అవ్వడం ఖాయం..!

-

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదైనా అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం సరికొత్త ఫీచర్లను పొందాలనే ఆశతో థర్డ్ పార్టీ అప్లికేషన్లను డౌన్ లోడ్ చేసుకుంటుంటారు. ఇంటర్నెట్ వెబ్ సైట్ లో లభించే ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ హానికరమైనవని అని మొబైల్ ఫోన్స్ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. కానీ కొంతమంది ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టి… వాళ్లకు తెలియని అసురక్షిత వెబ్ సైట్స్ నుండి అప్లికేషన్లను డౌన్ లోడ్ చేసుకుంటారు. గూగుల్ ప్లే స్టోర్ లో ఫేమస్ అయిన ప్రతి ఒక్క అప్లికేషన్ కి థర్డ్ పార్టీ అప్లికేషన్ కచ్చితంగా దొరుకుతుంది. అవి ఒరిజినల్ అప్లికేషన్ కలిగి ఉన్న ఫీచర్లతో పాటు కొన్ని సరికొత్త ఫీచర్లను కూడా కలిగి ఉంటాయి. ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సప్ కి కూడా మాడిఫైడ్ వెర్షన్ అఫ్ వాట్సాప్ అనే ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ బయట దొరుకుతుంది. అయితే ఈ అప్లికేషన్ వాడటం వలన మ్యాన్ ఇన్ ది మిడిల్ ఎటాక్స్ జరగవచ్చని వాట్సాప్ తాజాగా ట్విట్టర్ వేదికగా తెలిపింది.

whatsapp
whatsapp

వాట్సాప్ బీటా ప్రోగ్రాం గురించి అందరికీ తెలిసిందే. ఈ బీటా టెస్టింగ్ ప్రోగ్రాం లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ముందస్తుగానే అప్డేట్స్ వస్తుంటాయి. ఈ ప్రోగ్రాం లో జాయిన్ అయిన వినియోగదారులు ఫీడ్ బ్యాక్ అందించిన ప్రకారం మార్పులు చేస్తూ ఉంటుంది వాట్సాప్ యాజమాన్యం. అయితే ఈ అప్ డేట్స్ కూడా రుచించని కొంతమంది వినియోగదారులు మాడిఫైడ్ వాట్సాప్ ని వినియోగిస్తున్నారు. అలాంటి వారు కచ్చితంగా చిక్కుల్లో పడతారని వాట్సాప్ బీటా ప్రోగ్రాం యొక్క డెవలపర్లు తెలుపుతున్నారు.

థర్డ్ పార్టీ అప్లికేషన్లలో కొంతమంది డెవలపర్లు కావాలనే వినియోగదారుల డేటాను దొంగలించే టూల్ ని సెట్ చేస్తారని… ఫలితంగా వారి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకొని యూస్ చేసిన ప్రతి ఒక్కరి డేటా వారికి చేరి పోతుందని సాంకేతిక నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే వాట్సాప్ యాజమాన్యం వినియోగదారులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యం తో మోడెడ్ లేదా మాడిఫైడ్ వాట్సాప్ వాడేవారి అకౌంట్ బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. అందుకే వినియోగదారులు ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్ నుండి తప్ప ఇతర ఏ వెబ్ సైట్ నుండి అప్లికేషన్లు డౌన్ లోడ్ చేసుకోకుండా ఉండటం శ్రేయస్కరం.

Read more RELATED
Recommended to you

Latest news