చిగుళ్ళ నుండి రక్తం, దంతాల నొప్పులు ఇబ్బందిగా ఉన్నాయా? అది పయోరియా కావచ్చు.. పరిష్కారం ఇదిగో..!

-

దంత సమస్యలు చూడడానికి చిన్నగానే కనిపిస్తాయి. కానీ అది కలిగించే ఇబ్బంది మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. చిగుళ్ళ నుండి రక్తం కారడం, దంతాలు నొప్పిగా ఉండడం మొదలలైన ఇబ్బందులు మీకు తరచుగా కలుగుతున్నాయంటే అది పయోరియా అనే దంత వ్యాధి అయ్యుంటుంది. దాన్నుండి రక్షణ పొందడానికి సరైన రక్షణ తీసుకోవాలనుకుంటున్నారా? ఐతే ఆయుర్వేదంలోని ఈ వంటింటి చిట్కాలు పాటించండి.

పసుపు

పసుపు మనకి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన పనిలేదు. చాలారకాల వ్యాధులను దూరం పెట్టే లక్షణాలు పసుపుకి ఉన్నాయి. పయోరియా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే కొద్దిగా పసుపు, ఉప్పు, ఆవనూనెని కలుపుకుని దంతాలకి మసాజ్ చేయండి. కొద్దిసేపు అలాగే ఉంచి ఆ తర్వాత దంతాలను శుభ్రపర్చుకోండి.

వేప

వేపలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దంతాల ఆరోగ్యానికి వేప చాలా మేలు చేస్తుంది. పయోరియా బాధల నుండి ఉపశమనం పొందడానికి వేప ఆకుల రసాన్ని పళ్ళచుట్టూ మర్దన చేయాలి. ఆ తర్వాత 15నిమిషాలయ్యాక గోరు వెచ్చని నీటితో శుభ్రపర్చుకోవాలి. ఇలా రోజుకి ఒకసారి చేస్తే చిగుళ్ల నుండి రక్తం కారడం, దంతాలు నొప్పి పెట్టడం వంటి సమస్యలు దూరం అవుతాయి.

కొబ్బరి నూనె, నువ్వుల నూనె

పయోరియా బాధని తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహించే వాటిలో కొబ్బరి నూనె, నువ్వుల నూనె ప్రత్యేకమైనవి. వీటిని పళ్ళ మీద మర్దన చేసుకుని గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version