ప్రస్తుత పరిస్థితుల్లో జుట్టు ఊడిపోవడం కామన్ గా మారిపోయింది. ఆడా, మగా తేడా లేకుండా ప్రతీ ఒక్కరిలో ఈ సమస్య కనిపిస్తూ ఉంది. ఐతే జుట్టు ఊడిపోవడానికి చాలా కారణాలున్నాయి. ఆ కారణాల్లో ఒత్తిడి, రోగనోరోధక శక్తి సరిగ్గా లేకపోవడం, జన్యు సంబంధమైన కారణాలు ఉన్నాయి.ఇలాంటి కారణాల వల్ల జుట్టు ఊడిపోవడం కామనే. కానీ జుట్టు ఊడిపోయినా మళ్ళీ రాకుండా ఉంటేనే అది సమస్యగా మారవచ్చు. అర్థం కాలేదా? అదేనండీ.. కొన్ని సార్లు జుట్టు ఊడిపోవడం అనేది పెద్ద సమస్య కాదు.
ఎందుకంటే ఊడిపోయిన జుట్టు స్థానంలో మళ్ళీ కొత్త జుట్టు వస్తుంది. అంటే ఏవేవో కారణాల వల్ల జుట్టు ఊడిపోతుంటే ఆ కారణాల సమస్యలు పరిష్కారం అయితే గనక జుట్టు మళ్ళీ వస్తుంది. పని ఒత్తిడి కావచ్చు, బిడ్డకి జన్మనివ్వడం కావచ్చు. ఆపరేషన్ కి వెళ్ళడం, ఒకేసారి 10కిలోల బరువు తగ్గడం మొదలైన సందర్భాల్లో జుట్టు ఊడిపోతుంటుంది. ఈ సమయంలో రోజుకి 50 నుండి 100 వెంట్రుకలు రాలిపోతుంటాయి. దీనికి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు.
ఇలా ఊడిపోయిన జుట్టు 6నుండి 9నెలల్లో మళ్లీ తిరిగి వస్తుంది. మీరు పడుతున్న ఇబ్బంది దూరమైతే గనక మళ్ళీ జుట్టు పెరగడం మొదలవుతుంది. అంటే ఇలా జుట్టు ఊడిపోవడం తాత్కాలికం అన్నమాట. ఇక జుట్టు పూర్తిగా ఊడిపోయే సందర్భంలో మరలా జుట్టు పెరగకపోవడమే పెద్ద సమస్య. ఊడిపోయిన స్థానంలో మళ్ళీ జుట్టు పెరగకుండా ఉండడమే ఈ సమస్య.
ఊడిపోయిన స్థానంలో మళ్ళీ జుట్టు పెరగకుండా ఉండడమే ఈ సమస్య. ఇమ్యూనిటీ లేకపోవడం, జన్యు పరమైన కారణాలు వీటికి కారణమవుతాయి. ఇలాంటి టైమ్ లో జుట్టు మళ్ళీ రాకుండా ఉంటుంది. అందుకే మీ జుట్టు ఊడిపోవడానికి కారణాలేంటో తెలుసుకుని ప్రశాంతంగా ఉండండి.