ఉడికించిన గుడ్డు తినడమే ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్డు ఒక్కటే కాదు.. గుడ్డు ఉడకపెట్టిన వాటర్ కూడా మంచిదేనట.. ఆ నీళ్లను అందరూ పారేస్తారు. గుడ్డు పెంకులను మొక్కలకు వేస్తారు..కానీ ఆ వాటర్‌ను షింక్‌లోనే వేస్తాం. కోడిగుడ్లు ఉడకబెట్టిన నీటితో ఎన్నో లాబాలు ఉన్నాయి. కోడిగుడ్ల పెంకుల్లో కాల్షియం ఉంటుంది. మనం గుడ్లను నీటిలో మరిగించినపుడు ఆ గుడ్ల పెంకుల్లోని కాల్షియం నీటిలో కరుగుతుంది. ఒక్క కాల్షియం మాత్రమే కాదు, ఇలాంటి కొన్ని సమ్మేళనాలు కోడిగుడ్ల పెంకుల్లో ఉంటాయి. అవి నీటిలో కరిగినపుడు ఆ నీటిలో కాల్షియం వంటి మిశ్రమాలు మిలితమై ఉంటాయి.
గుడ్డు పెంకు 95 శాతం కాల్షియం కార్బోనేట్‌తో తయారవుతుంది. మిగతా పరిమాణాలలో భాస్వరం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, జింక్, మాంగనీస్, ఇనుము, రాగి వంటి మూలకాలు ఉంటాయి. గుడ్డును ఉడకబెట్టినప్పుడు ఈ మూలకాలన్నీ ఆ నీటిలో కలిసిపోతాయి. అప్పుడు సాధారణ నీరు కూడా మినరల్ వాటర్‌లా అవుతుంది. ఈ నీటిని మనం మొక్కలకు ఉపయోగించవచ్చు. గుడ్డు ఉడకబెట్టిన నీరు మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషణను అందించడానికి ఎరువుగా పనిచేస్తుంది.
అప్పుడప్పుడూ మొక్కలకు గుడ్ల పెంకులు వేయడానికి ప్రధాన కారణం ఇదే. గుడ్డు పెంకులు మొక్కలకు ఎరువుగా ఉపయోగపడతాయి. అయితే నేరుగా పెంకులు వేసే దానికన్నా గుడ్లు ఉడకబెట్టిన నీరును పోయడం వల్ల ఆ మొక్కల వేర్లు తొందరగా పోషకాలను గ్రహిస్తాయట.. ఇదే సమయంలో నీరు వేడిగా ఉన్నప్పుడు పోయకూడదు. కోడిగుడ్లు ఉడకబెట్టిన నీళ్లు చల్లారిన తర్వాత మొక్కలకు పోయాలి. ఇంట్లో మొక్కలు నాటేటపుడు, విత్తనాలు చల్లేటపుడు ఇలా గుడ్లు ఉడకబెట్టిన నీటిని వాడవచ్చు.
గుడ్డు పెంకులను కూడా పొడిగా చేసి ఆ మట్టిలో కలిపితే ఆ మట్టి మరింత ఫెర్టైల్‌గా మారుతుంది. చాలామంది అలానే వేసేస్తుంటారు. ఉడికించిన గుడ్డు నీరు టొమాటో మొక్కలకు మంచి పోషణ ఇస్తుంది. సూర్యరశ్మి ఎక్కువగా అందని మొక్కలకు కూడా గుడ్లు ఉడికించిన నీరు వాడవచ్చు. మిర్చి, వంగ మొక్కల్లో కూడా ఈ నీళ్లు పోయవచ్చు. పూల మొక్కల్లో కోడిగుడ్లు ఉడికించిన నీరు వేస్తే తెగుళ్లను ఎదుర్కొనే శక్తి ఆ మొక్కలకు లభిస్తుంది.
Attachments area