నేటి కాలం లో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. అయితే బిల్లు తేదీ, చెల్లించేందుకు ఉన్న వడ్డీ రహిత గడువు, ఈఎంఐ ఆప్షన్స్, వ్డడీ రేట్లు, ఆలస్య రుసుము ఇలా ప్రతీ విషయం తెలిస్తే మీ మీద అదనపు భారం పడకుండా ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బకాయిలను వినియోగదారులు తమ సామర్థ్యానికి అనుగుణంగా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
నిర్ణీత గడువు లోగ పే చెయ్యక పోతే పెద్ద మొత్తంలో వడ్డీ కింద కంపెనీలు చార్జ్ చేస్తుంటాయి. అలానే తిరిగి చెల్లింపుల్లో విఫలమైతే రుసుము కింద వెయ్యికిపైగా వసూలు చేస్తుంటాయి. కాబట్టి సకాలం లో చెల్లించడం ముఖ్యం.
లేదా కొంత భాగాన్ని ఈఎంఐగా మార్చుకోవడం కూడా మంచిదే. క్రెడిట్ కార్డు తిరిగి చెల్లింపు కాల వ్యవధి సాధారణంగా 3 నుంచి 60 నెలల వరకు ఉంటుంది. దీని పై వార్షిక వడ్డీ రేటు 11–24 శాతంగా ఉండచ్చు. క్రెడిట్ కార్డ్ కంపెనీని బట్టి ఇవి మారతాయి.
ఇది ఇలా ఉంటే కొన్ని సార్లు వడ్డీ లేకుండానే ఈఎంఐ చెల్లించండి అనే ప్రకటనలు చూసే ఉంటారు. మర్చంట్ ఈఎంఐ ఆప్షన్ లో ఒక రకం నో కాస్ట్ ఈఎంఐ స్కీమ్. దీనిలో ఈఎంఐ మీద వడ్డీని తయారీదారులు భరిస్తారు. దీంతో ఉత్పత్తి లేదా సేవల ధరను ఈఎంఐల రూపంలో అనుమతించిన కాల వ్యవధి మేరకు కొనుగోలుదారులు చెల్లించాల్సి ఉంటుంది.
ఈఎంఐ మీద వడ్డీ భారం లేకున్నా ఆ వడ్డీపై 18% జీఎస్‌టీని క్రెడిట్ కార్డ్ వినియోగదారులే కట్టాలి. ఇది ఇలా ఉంటే మంచి సిబిల్ స్కోర్ ఉంటే క్రెడిట్ కార్డులపై రుణాలను తీసుకోవచ్చు. సరిగ్గా చెల్లించకపోతే క్రెడిట్ కార్డు లిమిట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేస్తారు.