అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నుమ్డి వస్తున్న మరో చిత్రం ఆనిమల్. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుందని నూతన సంవత్సర కానుకగా ప్రకటించారు. ఆనిమల్ సినిమా నుండి వచ్చిన మోషన్ పోస్టర్ అందరినీ ఆకర్షించింది. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా పరిణీతి చోప్రా చేయడమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. గత కొన్ని రోజులుగా పరిణీతి చేసిన పెద్ద ప్రాజెక్ట్ ఒక్కటి కూడా కనిపించలేదు. మరి ఇప్పుడు ఆనిమల్ సినిమాలో ఆఫర్ ఎలా వచ్చిందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
దానికి కారణం ఉందంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఆనిమల్ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా తక్కువగా ఉంటుందట. దీనిపై దర్శకుడు సందీప్, చాలా మంది హీరోయిన్లని అడిగారట. కానీ ఎవ్వరూ కూడా అంత తక్కువ నిడివి గల పాత్ర చేయడానికి ఇష్టపడలేదట. చివరికి పరిణీతి ఓకే అందట. గత కొన్ని రోజులుగా పెద్ద సినిమాల్లో కనిపించని పరిణీతికి పాత్ర నిడివి తక్కువైనా ఈ అవకాశం రావడం మంచిదే అని అంటున్నారు. ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ కి అంత స్కోప్ ఇచ్చిన సందీప్, ఇలా తన రెండవ చిత్రానికి తక్కువ నిడివికే పరిమితం చేస్తున్నాడన్న వార్త ఆశ్చర్యంగా మారింది.