త్రివిధ దళాల అధినేతలతో కూడిన చీఫ్ ఆఫ్ కమిటీస్ చైర్మన్‌గా ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే బాధ్యతలు తీసుకున్నారు. డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన ఐఏఎఫ్ హెలిక్యాప్టర్ ప్రమాదంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మృతిచెందినప్పటి నుంచి చీఫ్ ఆఫ్ కమిటీస్ చైర్మన్ పదవి ఖాళీగా ఉన్నది. త్రివిధ దళాల అధినేతల్లో ఎంఎం నరవాణే అత్యంత సీనియర్ కావడంతో ఆయనకు చీఫ్ ఆఫ్ కమిటీస్ చైర్మన్ పదవిని అప్పగించారు.
ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ వరుసగా సెప్టెంబర్ 30, నవంబర్ 30వ తేదీలలో పదవీ బాధ్యతలు చేపట్టారు.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ పదవిని సృష్టించడానికి ముందు త్రివిధ దళాల అధినేతల్లో సీనియర్‌ను చీఫ్ ఆఫ్ కమిటీస్ చైర్మన్‌గా నియమిస్తూ వస్తున్నారు.
మంగళవారం చీఫ్ ఆఫ్ కమిటీ సమావేశమై హెలిక్యాప్టర్ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన జనరల్ బిపిన్ రావత్, ఆయన మధులికతోపాటు మరో 11 మంది ఆర్మీ అధికారులకు నివాళులు అర్పించారు.