పొలాల్లో ఆర్మీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!

-

సాధారణంగా ఏదైనా  ఎమర్జెన్సీ సంభవించినప్పుడు హెలికాప్టర్లు, విమానాలు తప్పకుండా ల్యాండ్ అవుతుంటాయి. ఈ సందర్భంలో కొన్ని సార్లు ప్రమాదాలు సంభవించి అవి పేలుతూ కూడా ఉంటాయి. అయితే తాజాగా ఓ వ్యవసాయ క్షేత్రంలో ఎమర్జెన్సీగా  ఆర్మీ హెలికాప్టర్  ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది.

ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామం వద్ద చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం విజయవాడలో వరద సహాయక, చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆర్మీ హెలికాప్టర్ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ కి తిరుగు ప్రయాణ మైంది. ఈ నేపథ్యంలో మార్గ మధ్యలో హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్ చిట్యాల మండలం వణిపాకల గ్రామ శివారు లోని వ్యవసాయ పొలంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. హెలికాప్టర్ లో ఉన్న ఫైలెట్ తో సహా ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news