సాధారణంగా ఏదైనా ఎమర్జెన్సీ సంభవించినప్పుడు హెలికాప్టర్లు, విమానాలు తప్పకుండా ల్యాండ్ అవుతుంటాయి. ఈ సందర్భంలో కొన్ని సార్లు ప్రమాదాలు సంభవించి అవి పేలుతూ కూడా ఉంటాయి. అయితే తాజాగా ఓ వ్యవసాయ క్షేత్రంలో ఎమర్జెన్సీగా ఆర్మీ హెలికాప్టర్ ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది.
ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామం వద్ద చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం విజయవాడలో వరద సహాయక, చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆర్మీ హెలికాప్టర్ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ కి తిరుగు ప్రయాణ మైంది. ఈ నేపథ్యంలో మార్గ మధ్యలో హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్ చిట్యాల మండలం వణిపాకల గ్రామ శివారు లోని వ్యవసాయ పొలంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. హెలికాప్టర్ లో ఉన్న ఫైలెట్ తో సహా ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు.