కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీనితో పెన్షనర్లకు భారీ ఊరట కలిగించింది. ఈ నిర్ణయంతో చాలా మంది పెన్షనర్లకు ఊరట లభిస్తుంది అని చెప్పొచ్చు. మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఎవరికి ప్రయోజనం కలగబోతోంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోడీ సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీం 1995 కి సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టం కి మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ నిర్ణయంతో దాదాపు 78 లక్షల మందికి ఊరట లభించబోతోంది. జాతీయస్థాయిలో సెంట్రల్ లైసెన్సుడ్ పెన్షన్ పేమెంట్ సిస్టం అమల్లోకి రాబోతుంది. దీనివలన ఈపీఎస్ పెన్షనర్లకు దేశంలో ఎక్కడైనా ఏ బ్యాంకులో అయినా ఏ బ్రాంచ్ లో నైనా పెన్షన్ వస్తుంది.
కేంద్ర కార్మిక శాఖ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని చెప్పింది. ఈపీఎఫ్ఓ ఆధునికరణలో ఈ సెంటర్లైజెడ్ పెన్షన్ పేమెంట్ సిస్టం అనేది ఒక మైలు రాయి అని చెప్పవచ్చు. ఈ కారణంగా పెన్షన్స్ ని ఏ బ్యాంకు లేదా ఏ బ్రాంచ్ నుంచి అయినా కూడా తీసుకోవడానికి అవుతుంది. పెన్షన్ పంపిణీ విధానంలో పెన్షనర్లు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న ఈ సమస్యకు ఇప్పుడు పరిష్కారం లభించబోతోంది.