తెలంగాణలో నేటి నుంచి ఆరోగ్య మహిళ ప్రారంభం

-

తెలంగాణ రాష్ట్ర మహిళల ఆరోగ్యం కోసం ఆరోగ్య మహిళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేసిఆర్ ప్రభుత్వం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 24 జిల్లాల్లో 100 కేంద్రాల్లో ఈ ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. కరీంనగర్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు , స్థానిక ప్రజా ప్రతినిధులు, మంత్రులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి మంగళవారం మహిళా వైద్యులు, సిబ్బందితో ప్రత్యేకంగా మహిళల కోసం సర్కారు క్లినిక్ లను నిర్వహించనుంది. పూర్తిగా మహిళలకు వచ్చే ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పరీక్షలు, మందుల పంపిణీ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా సర్వైకల్ క్యాన్సర్, యూరినరీ ట్రాక్ ఇన్ ఫెక్షన్ వంటి వ్యాధులకు ర్యాపిడ్ టెస్టులు, పీసీఓడీ వంటి సమస్యలకు ఆల్ట్రా సౌండ్ స్కాన్ లు చేయటంతో పాటు… మైక్రో న్యూట్రియంట్స్ లోపాలకు సంబంధించిన రక్త పరీక్షలను ఉచితంగా అందించనున్నారు.

ఇందులో భాగంగా సొంతంగా రొమ్ము పరీక్షలను ఎలా చేసుకోవాలో మహిళలకు శిక్షణ  ఇవ్వనున్నారు. మోనోపాజ్‌లో వచ్చే సమస్యలు, పీసీఓడీ లక్షణాలపై అవగాహన కల్పించనున్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారం, వ్యాయామ విధానాలను సైతం వివరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news