ఢాకాలో భారీ పేలుడు.. 17 మంది దుర్మరణం

-

బంగ్లాదేశ్​ రాజధాని ఢాకా నగరంలో భారీ పేలుడు సంభవించింది. మంగళవారం సాయత్రం ఓ ఏడు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకుంది. అందులో ఉన్న 17 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. ఆ భవనం శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకునే అవకాశం ఉన్నందున మరణించే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసుల వెల్లడించారు.

సమచారం అందుకున్న అగ్నిమాపక దళాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వీరితోపాటుగా ర్యాపిడ్ యాక్షన్​ బెటాలియన్​లోని బాంబు నిర్వీర్యం విభాగం కూడా అక్కడకు చేరుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఢాకా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినట్లు డీఎంసీబహెచ్​ పోలీసులు అధికారి బచ్చు మియా వెల్లడించారు.

ఈ భవనం కింద అంతస్తులో శానిటరీ ఉత్పత్తుల దుకాణాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన ఈ బిల్డింగ్​కు పక్కనే బీఆర్​ఏసీ బ్యాంక్ కూడా ఉంది. ఈ ప్రమాదం దాటికి ఆ బ్యాంకు అద్దాలు పగిలిపోయాయి. దీంతో పాటుగా రోడ్డుపై ఉన్న ఓ బస్సు కూడా ధ్వంసమైంది. వ్యాపార సముదాయంలో నిల్వ ఉంచిన రసాయనాల కారణంగా పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news