Breaking : ఎన్నికల సంఘం కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌

-

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్‌ గోయల్‌‌ నియమితులయ్యారు. అయితే.. అరుణ్ గోయ‌ల్‌ను ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా నియ‌మిస్తూ శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేసింది కేంద్ర న్యాయ శాఖ. దాంతో, ఆయ‌న‌ మూడో ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ సుశిల్ చంద్ర మే నెల‌లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. దాంతో, మూడో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా ఉన్న రాజివ్ కుమార్ భార‌త ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అప్ప‌టినుంచి మూడో ఎన్నిక‌ల అధికారి పోస్ట్ ఖాళీగా ఉంది. రెండో ఎన్నిక‌ల అధికారిగా అనూప్ చంద్ర పాండే కొన‌సాగుతున్నారు. పంజాబ్‌ కేడ‌ర్‌కు చెందిన అరుణ్ 1985 బ్యాచ్ ఎఏఎస్ అధికారి.

కేంద్ర సీఈసీగా అరుణ్ గోయల్

34 ఏళ్లు ప‌లు హోదాల్లో ఆయ‌న‌ సేవ‌లు అందించారు. జీఎస్‌టీ కౌన్సిల్‌లో అడిష‌న‌ల్ సెక్రెట‌రీగా ప‌నిచేశారు. ఢిల్లీలో ఇంజినీరింగ్ చ‌దివిన అరుణ్ గోయ‌ల్ ఆ త‌ర్వాత అహ్మ‌దాబాద్‌లోని ఐఐఎంలో పీజీ పూర్తి చేశారు.ఈ మ‌ధ్యే గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. రాబోయే రోజుల్లో మ‌రిన్ని రాష్ట్రాల్లో, 2024లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దాంతో, కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా మూడో ఎన్నిక‌ల అధికారి పోస్ట్‌ను భ‌ర్తీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news