ఆర్యన్ ఖాన్ కు మరో షాక్.. రెండోసారి బెయిల్ తిరస్కరణ

-

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు మరో దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఆర్యన్ ఖాన్ కు బెయిల్ నిరాకరించింది ముంబై హై కోర్టు. ముంబై డ్రగ్స్ కేసులో అరెస్టయిన సారు కొడుకు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ముంబై హైకోర్టు.

రెండు రోజుల కింద ఆర్యన్ ఖాన్ బెయిల్ ను తిరస్కరించిన కోర్టు… ఇవాళ మరోసారి తిరస్కరించడం గమనార్హం. దీంతో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు నిరాశ తప్పలేదు. బెయిల్ పై ఆర్యన్ ఖాన్ బయటికి వస్తే… సాక్ష్యా ధారాలు మరియు కేసు మరో మలుపు తిరిగే అవకాశం ఉందని… ఈ నేపథ్యంలోనే బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించామని పేర్కొంది కోర్టు. ఇక ప్రస్తుతం ఈ కేసు విచారణ మరో వారం రోజుల పాటు వాయిదా వేసింది కోర్టు. కాగా ముంబై క్రూయిజ్ రేవ్ పార్టీపై దాడిలో NCB అధికారులు ఆర్యన్ ఖాన్ తో సహా 8 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version