తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. 7 రోజుల పాటు తెలంగాణ వర్షాకాల సమావేశాలు జరిగాయి. దాదాపు 37 గంటల పాలు చర్చల జరిగాయి. శాసన సభ ఏడు రోజుల్లో దాదాపు 41 మంది ప్రసంగించారు. ఏడు రోజుల్లో పలు విషయాలు అభివ్రుద్ధి పనులు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపేలా చర్చలు జరిగాయి. దీంతో పాటు హరితహారంపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. వీటితో పాటు రైతు పంట నష్టం, రాష్ట్రంలో శాంతిభద్రతలు, ధరణి వెబ్ సైట్ పై చర్చ జరిగింది. శాసన సభ సమావేశాల్లో 7 బిల్లులను ఆమోదించడంతో పాటు, బీసీ కులగణన చేయాలనే తీర్మాణాన్ని ఆమోదించింది. ఆరు అంశాలపై శాసన సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. శాసనసభ నిర్వహిస్తున్న క్రమంలో గులాబ్ తుఫాన్ రావడంతో మధ్యలో రెండు రోజులు వాయిదా పడింది. ప్రస్తుతం శీతాకాల సమావేశాల వరకు నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది.