ఇందిరా గాంధీ స్టేడియంలో వేడుకలు లేనట్లే, కారణం అదే…?

-

74వ పంద్రాగష్టు వేడుకలకు ముస్తాబవుతున్న ఇందిరాగాంధీ స్టేడియం అనే వార్త అలా వచ్చిందో లేదో బెజవాడలో నిన్న పడిన భారీ వర్షం చుక్కలు చూపించింది. 3 దఫాలుగా ఏర్పాట్లపై ట్రైల్ రన్ కూడా నిర్వహించారు అధికారులు. ఈ ఏర్పాట్లను ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ నగర కార్పొరేషన్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్, సీపీ బి.శ్రీనివాసులు పర్యవేక్షించారు. పంద్రాగష్టు వేడుకలలో పాల్గొననున్నాయి ఆరు బెటాలియన్లకు చెందిన ఆరు కంటింజెంట్లు.

ఇక రాత్రి నుండి కురుస్తున్న వర్షం తో చిత్తడిగా మారింది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం. రేపు స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగాల్సి ఉంది. వర్షం తో బురదమయంగా మారిపోయింది స్టేడియం ప్రాగణం. స్టేడియం ప్రాంగణం బురద గా మారడంతో ప్రత్యామ్నాయంగా పరేడ్ జరిగేందుకు చిప్స్ తో మరో రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడా అసౌకర్యం లేకుండా చర్యలు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news