కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నామంటూ.. ఆన్ లైన్ దోపిడీ..!

-

సైబర్‌ నేరగాళ్ల బారిన పడి లక్షలకు లక్షలు పొగొట్టుకుంటున్న ఉదంతాలు దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక చోటు చేసుకుంటున్నాయి. మీ వ్యాలెట్.. బ్యాంక్ ఖాతాను ఆధునీకరిస్తామని ఫోన్ చేసి వివరాలు సేకరిస్తారు. ఎదోక ఫ్రాడ్ లింక్ పెట్టి డౌన్ లోడ్ చేయమని చెబుతారు. మనం గుడ్డిగా నమ్మి క్లిక్ చేస్తే చాలు అటుపై ఖాతాలోని సొమ్ము మెుత్తం మాయం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇలా నమ్మించి ఫోన్లో వివరాలన్నీ సేకరించి.. ఆపై బ్యాంక్ ఖాతాలోని నగదు దొంగిలిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది.

online
online

మొదట అశోక్‌ మాన్వాటే అనే వ్యక్తి ఫోన్ కు కస్ట మర్‌ కేర్‌ నుంచి కాల్ వచ్చింది. ఫోన్‌లో రిమోట్ డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చెప్పారు. ఆ సమయంలో తండ్రి మొబైల్‌ ఫోన్‌ను ఉపయోగిస్తున్న 15 ఏళ్ల మైనర్‌ బాలుడు వారు పంపించిన లింక్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేశాడు. అంతే ఒక్క నిమిషంలోనే వారి బ్యాంకు ఖాతాలో నుంచి రూ. 9 లక్షలు మాయం.

విషయం తెలుసుకున్న తండ్రి అశోక్ వెంటనే‌ మాన్వాటే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సెక్షన్‌ 419, 420 కింద కేసు నమోదు చేసుకున్నారు. ఇలాంటి ఫ్రాడ్‌ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. నిందితులు కాలర్‌ యాక్సెస్‌ పొందిన వెంటనే డబ్బును తమ అకౌంట్స్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారని పేర్కొన్నారు. సైబర్‌ మోసాలు నిత్యకృత్యంగా మారాయని మోసగాళ్ల ఫోన్లకు మెసేజ్ లకు స్పందించవద్దని తెలిపారు.

ఇలాంటి ఘటనలు ఎల్లప్పుడు చోటు చేసుకుంటున్నాయని సైబర్ నేరగాళ్లు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వెబ్ సైట్లలో కనిపించిన ప్రతీ లింక్ ను ఓపెన్ చేయరాదని అప్రమత్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news