Asalem jarigindi: తెలంగాణలో జరిగిన వాస్తవిక సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రం అసలేం జరిగింది. ఈ చిత్రంలో శ్రీరామ్, సంచిత పదుకునే జంటగా నటించారు. కొత్త తరహా కాన్సెప్ట్‌తో చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ ఎన్వీఆర్. చిత్ర నిర్మాణంలో ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టు వ్యవహరించారు నిర్మాతలు మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యాడ. ఈ చిత్రాన్ని ఎక్స్ డోస్ మీడియా బ్యానర్‌పై నిర్మించారు. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సస్పెన్స్, లవ్ స్టోరీ, హారర్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన చిత్రం శుక్రవారం ( అక్టోబర్ 22న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒరిస్సా, అండమాన్ లో రిలీజ్ అయ్యింది.
ఈ మూవీ హర్రర్ ఎంటర్ టైన్ గా వచ్చినా.. ఇందులోని ప్రతి పాట కూడా హిటే.. ఇందులో ఉన్న ఐదు పాటలు వేటికి అవే అద్భుతం అని చెప్పాలి.. ముఖ్యంగా తల్లి కొడుకుల ప్రేమను ప్రతిబింబించేలా రూపొందించిన నింగిలోనా చందమామ.. ఒంటరై పోయేనే.. నన్ను కన్న తల్లి దూరమాయనే..
అంటూ సాగే పాట చాలా బాగుంది. పాట వింటుంటే హృదయం ద్రవించుకపోతుంది. ఆ పాటలను తెరకెక్కిన విధం కూడా చాలా అద్బుతం.. ఆ పాటను వెండి తెరపై చూస్తే.. కంటతడి పెట్టని వారుండరంటే.. అతిశయోక్తి కాదు. కఠిన హృదయాలను కూడా మంచు ముక్కలా కరిచిపోయే ఈ పాటకు సాహిత్యం అందించారు వెంకటేశ్.
ఆ పాటకు సర్వకల్పన చేసింది యేలేందర్ మహావీర్.. అలాగే.. యేసుదాస్ కుమారుడు విజయ్ యేసుదాస్ ఈ పాటకు గాత్రం అందించి పాటకు ప్రాణం పోశారు. ఈ సినిమా హిట్ కావడంలో ఈ పాట కూడా కీలక భూమిక పోషించడటం లో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. పాటలే కాదు.. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం హర్ట్ టచింగ్ గా .. ఎంతో ఉత్కంఠకు గురిచేస్తేలా ఉన్నాయి. చిన్న సినిమానే అయినా.. పెద్ద హిట్ కొట్టిందనే చెప్పాలి.. మూవీ మేకర్స్ కష్టానికి దగ్గ ప్రతిఫలం దక్కింది.