యాషెస్ టెస్ట్: మరోసారి బెయిర్ స్టో ను వెంటాడిన దురదృష్టం … !

-

మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా ల మధ్యన నాలుగవ యాషెస్ టెస్ట్ జరుగుతోంది. టాస్ ఓడిపోయినా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసి మొదటి ఇన్నింగ్స్ లో 317 పరుగులకు ఆల్ అవుట్ అయింది, బదులుగా ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్ ను 592 పరుగులు చేసి అల్ అవుట్ అయింది. ఇంగ్లాండ్ ప్లేయర్స్ లో క్రాలీ 189, మొయిన్ అలీ 54, రూట్ 84, బ్రూక్ 61, స్టోక్స్ 51 పరుగులు చేసి ఇంగ్లాండ్ కు మంచి లీడ్ ను అందించారు. కాగా కీపర్ మరియు బ్యాట్స్మన్ అయిన బెయిర్ స్టో ఫిఫ్త్ డౌన్ గా క్రీజులోకి వచ్చి ధనాధన్ బ్యాటింగ్ తో రెచ్చిపోయి ఆడాడు. ఇతను కేవలం బంతుల్లో 99 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఇతని ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు మరియు 4 సిక్సులు ఉన్నాయి. కాగా బెయిర్ స్టో మాత్రం సెంచరీ కి కేవలం ఒక్క పరుగు దూరంలో ఉండగా ఇంగ్లాండ్ ఆల్ అవుట్ అవ్వడం దురదృష్టం అని చెప్పాలి.

ఇతను 99 పరుగుల వద్ద ఉండగా ఆఖరి వికెట్ గా ఆండర్సన్ అవుట్ అవ్వడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇక రెండవ టెస్ట్ లో ఓవర్ అయిందని ముందుకు వెళ్లగా అలెక్స్ క్యారీ రన్ అవుట్ చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news