యాషెస్ టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండవ టెస్ట్ లార్డ్స్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా తన మొదటి ఇన్గ్స్ ను కొనసాగిస్తోంది. ఇంగ్లాండ్ బౌలర్లు ఆస్ట్రేలియాను పూర్తిగా కట్టడి చేయడంలో విఫలం అయ్యారు అని చెప్పాలి. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోర్ 400 దాటింది. మొదటగా వార్నర్ (66) అర్ద సెంచరీ చేయగా, ఆ తర్వాత హెడ్ (77) కూడా అర్ద సెంచరీ అందుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా స్మిత్ మాత్రం నెమ్మదిగా ఆడుతూ స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో స్మిత్ తన టెస్ట్ కెరీర్ లో 32వ సెంచరీ చేశాడు. సెంచరీ చేసిన అనంతరం వేగంగా పరుగులు చేయాలన్న ఉద్దేశ్యంతో జోష్ టోంగ్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరపాటు చేసిన స్మిత్ డక్కెట్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
లార్డ్స్ యాషెస్ టెస్ట్: 32వ సెంచరీ చేసిన స్టీవెన్ స్మిత్…
-