ఆంధ్రప్రదేశ్లో జిల్లా పరిషత్ ఎన్నికలు ఇప్పుడు కాక రేపుతున్నాయి. కొత్తగా ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమితులైన నీలం సాహ్ని ఆమె బాధ్యతలు చేపట్టిన రోజే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి సంచలనం రేపారు. అయితే అంతకు ముందే తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించాలని ఆలోచన చేస్తున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే అదేమీ లేదని బహిష్కరించాలని నిర్ణయం ఇంకా తీసుకోలేదని అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఈరోజు పాలిట్ బ్యూరో సమావేశమయి అంశం మీద నిర్ణయం తీసుకుంటారు అని భావించారు.
అయితే ఈ పాలిట్ బ్యూరో సమావేశానికి విజయనగరం జిల్లాకు చెందిన కీలక నేత మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు గైర్హాజరు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. టీడీపీ తీసుకున్న నిర్ణయం ఆయనకు నచ్చలేదని ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం సరికాదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.బాబు గా నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయిపోయిన తరుణంలో ఇప్పుడు వెనక్కి తగ్గితే క్యాడర్లో నిరాశ నిస్పృహలు ఏర్పడుతాయని ఆయన పేర్కొన్నట్లు చెబుతున్నారు. ప్రతి చిన్న పార్టీ కార్యక్రమంలో సైతం చాలా యాక్టివ్గా పాల్గొని అశోక్గజపతిరాజు ఇలా పాలిట్ బ్యూరో సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది