విజయనగరం రామతీర్థం బొడికొండపై ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. రామాలయం శంకు స్థాపన చేస్తున్న నేపథ్యంలో… ఆలయ ధర్మ కర్త రామతీర్థం దగ్గర అశోక్ గజపతి రాజు కు ఘోర అవమానం జరిగింది. కొబ్బరి కాయ కూడా కొట్టనివ్వకుండా.. అశోక్ గజపతి రాజును మంత్రి వెల్లం పల్లి ఆపేశారు. దీంతో… ఆవేశానికి లోనైన అశోక్ గజపతి రాజు.. శంకుస్థాపన శిలా ఫలకాలను తోసేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ… ఘటన జరిగి ఏడాది అవుతున్న ఇంత వరకు నిందితులను పట్టుకోలేదని.. ఏడాదిలో గుడి కట్టి తీరుతం అని చెప్పి ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా జరగక పోవడం దారుణమని ఫైర్ అయ్యారు. ఆధారాలును తారుమారు చేయడానికి ఇంత లేట్ చేసారని.. ఆలయం ధర్మ కర్త కు కనీసం మర్యాద ఇవ్వడం లేదని మండిపడ్డారు. గుడికి విరాళం ఇస్తే నా మొహం పై విసిరి కొట్టారని.. భక్తులు విరాళాలు తిరస్కరించడానికి మీకేవరు అధికారం ఇచ్చారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం హయాంలో వందలాది ఆలయాలు ధ్వంసం జరిగాయని.. విగ్రహాలు నేనే పడగొట్టానని ప్రచారం చేశారన్నారు. గుడి ధ్వంసం చేసిన దొంగలు ఎవరు అనేది తేల్చాలని డిమాండ్ చేశారు.