కేసీఆర్ కు బిగ్ షాక్‌.. ఎర్ర‌వెల్లి ఫాంహౌజ్ లో ప‌డి యువ‌కుడి మృతి !

తెలంగాణ సీఎం కేసీఆర్‌… ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి లోనే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఈ క్షేత్రంలో కూలిపనులకు వచ్చిన ఓ యువకుడు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. పరిసర గ్రామాల నుంచి ప్రతి రోజూ కూలీలు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి పనుల కోసం వస్తూ ఉంటారు.

kcr
kcr

మూడు రోజులుగా పెద్ద బావి సమీపంలోని మూళ్ళ పాదాలను తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎర్రబెల్లి పక్కనే ఉన్న వరద రాజాపూర్ గ్రామానికి చెందిన రెడ్డి మైన ఆంజనేయులు (19) మంగళవారం ఫామ్ హౌస్ కు కూలి పనుల కోసం వెళ్ళాడు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆ బావి దగ్గర ఉన్న పొదలను తొలగిస్తుండగా… ఆంజనేయులు కాలు జారి పడ్డాడు. దీంతో ఆ యువ‌కుడు అక్క‌డిక్క‌డే మృతి చెందాడు. దీంతో అత‌ని కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. అయితే.. ఆంజ‌నేయులు కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని ఫామ్ హౌజ్ అధికారులు చెప్పిన‌ట్లు తెలుస్తోంది.