తెలంగాణ ప్ర‌జ‌ల‌కు పీయూష్ గోయల్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి : హ‌రీష్ రావు

కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ పై మంత్రి హరీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పీయూష్ గోయల్ వ్యాఖ్యలు.. తీవ్ర అభ్యంతరకరమ‌ని… తెలంగాణా ప్రజలను అవమాన పరిచారని ఆగ్ర‌హించారు. కేంద్రమంత్రిగా కాకుండా రాజకీయం చేస్తున్నారని.. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రులు రైతుల పక్షాన ఢిల్లీకి వచ్చారని… పీయూష్ గోయల్ తన వాఖ్యలు ఉపసంహరించుకోవాలని మండిప‌డ్డారు.

రాష్ట్ర ప్రభుత్వ బృందాన్ని అవమానించే హక్కు ఎక్కడిదని… మీ పార్టీ నాయకులకు సమయం ఎలా ఇచ్చారని నిల‌దీశారు హ‌రీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బృందాన్ని కలవరా.. ఆరుగురు మంత్రులు రైతుల కోసం వచ్చారని చుర‌క‌లు అంటించారు. మా ప్రాధాన్యత రైతులు.. మీరు రాజకీయం చేస్తున్నారు.. తెలంగాణ బీజేపీ నాయకులు ఎం సమాధానం చెప్తారని ప్ర‌శ్నించారు హ‌రీష్ రావు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని మధ్యలో వదిలేశారు.. వెన్నుపోటు పొడిచిన పార్టీ బిజెపి అని ఆగ్ర‌హించారు హ‌రీష్ రావు.