రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాత్, కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల ప్రతిపాదన, ఒకటే దేశం..ఒకే ఎన్నిక ప్రణాళికలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎలాంటి ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించకుండా కేంద్రం వన్ నేషన్..వన్ ఎలక్షన్ ప్రతిపాదనను ముందుకు తీసుకువస్తోందని వెల్లడించారు ముఖ్య మంత్రి. భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి ఇది సరైన ఉదాహరణ అని మండిపడ్డారు ఆయన. నరేంద్ర మోదీ హయాంలో భారత ప్రజాస్వామ్యానికి పెను ముప్పు ఎదురవుతోందని సంచలన వ్యాఖ్యలు చేపట్టారు.
దేశం ఎటు వైపు వెళుతుందనేది ఎవరికీ తెలియని దుస్ధితి నెలకొందని అశోక్ గెహ్లాత్ అన్నారు. మరోవైపు దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందనే వార్తలపై విపక్ష నేతలు విరుచుకుపడ్డారు. విపక్షాలు ఇండియా కూటమితో ముందుకు రావడంతోనే జీ20 డిన్నర్‌కు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో ఆహ్వాన పత్రం పంపారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మోదీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తపరిచారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి బీజేపీని అధికారం నుంచి సాగనంపుతుందని అన్నారు ఆయన. ఇండియా అనే ఒక్కపదంతోనే బీజేపీ ఉలిక్కిపడుతోందని హేళన చేశారు.