విజయ్ దేవరకొండ తో అషూ రెడ్డి వీడియో కాల్.. ఫొటోస్ వైరల్..!!

-

విజయ్ దేవరకొండ.. కెరియర్ మొదట్లో చిన్నాచితక పాత్రలు వేస్తూ పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గీత గోవిందం లాంటి సినిమాలతో మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ..ఇటీవల అన్ని పాన్ ఇండియా సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ప్రస్తుతం లైగర్ , జనగణమన, ఖుషి వంటి పాన్ ఇండియా సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఇకపోతే విజయ్ దేవరకొండ తో మాట్లాడాలి అంటే ఆయనకు సంబంధించిన ఏదైనా ఒక విషయం జరిగితే తప్ప చాలావరకు మాట్లాడడు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇటీవల బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డితో అర్జున్ రెడ్డి వీడియో కాల్ మాట్లాడడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎప్పుడు? ఎవరు? ఎలా? ఏ విధంగా పాపులర్ అవుతారో? చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా డబ్స్ మ్యాష్, టిక్ టాక్ వంటి యాప్ లు వచ్చిన తర్వాత చాలామంది పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే అలా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో అషూ రెడ్డి మొదటి స్థానంలో ఉంటుంది. ఇప్పటికే ఈమె మొదటి సారీ బిగ్ బాస్ షో చేసిన తర్వాత రాంగోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఈమెకు మరింత పాపులర్ తీసుకొచ్చి పెట్టింది. తర్వాత బిగ్ బాస్ ఓటిటి లో కూడా పాల్గొని సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఇటీవల ఉ అంటావా మామ ఊ ఊ అంటావా అనే సమంత ఐటమ్ సాంగ్ కి స్టెప్పులు వేసి జూనియర్ సమంత గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇదిలా ఉండగా తాజాగా అషూ రెడ్డి , విజయ్ దేవరకొండ తో వీడియో కాల్ మాట్లాడినట్లు అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఈమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఇకపోతే దీన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? ఎందుకు వీడియో కాల్ చేసుకున్నారు? ఇలా రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక అసలు విషయం తెలియదు కానీ విజయ్ దేవరకొండ తో అషూ మాట్లాడిన వీడియో కాల్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ కాస్త పెట్టింట వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version