భారత్, ఇంగ్లండ్ ల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్‌లో భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 286 పరుగులకు ఆలౌట్ అయింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ చేయడంతో భారత్ భారీ ఆధిక్యం సాధించింది. అశ్విన్‌కు ఇది టెస్టుల్లో 5వ సెంచరీ కాగా.. అటు తొలి ఇన్నింగ్స్‌లో అతను 5 వికెట్లు తీసి బౌలింగ్‌లోనూ రాణించాడు. ఈ క్రమంలో అశ్విన్ సెంచరీ చేయడం ఆసక్తికరంగా మారింది.
ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్, మొయిన్ అలీలకు చెరో 4 వికెట్లు దక్కగా, ఆల్లీ స్టోన్ 1 వికెట్ పడగొట్టాడు. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు రెండో ఇన్నింగ్స్ అనంతరం 481 పరుగుల ఆధిక్యం వచ్చింది. ఇక ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే 482 పరుగుల స్కోరును చేయాల్సి ఉంటుంది.
ఇక ఇది 3వ రోజే. కనుక చూస్తే స్కోరు సాధించేలా కనిపిస్తున్నప్పటికీ అది అసాధ్యమనే చెప్పవచ్చు. ఎందుకంటే పిచ్ ఇప్పటికే పూర్తిగా మారిపోయింది. స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తోంది. దీంతో ఇంగ్లండ్ మంగళవారం సాయంత్రం వరకు ఆడితే అది అద్భుతమనే చెప్పవచ్చు.