ASIA CUP 2022 : ఆసియా కప్ లో భాగంగా నిన్న హాంకాంగ్ మరియు పాక్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ రసవత్తర మ్యాచ్ లో పాక్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో సూపర్ 4 కు దూసుకెళ్లింది పాక్. దీంతో ఆసియాకప్-2022 లీగ్ దశ మ్యాచ్ లు శుక్రవారం తో ముగిశాయి. ఇక గ్రూపు-ఏ నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు అర్హత సాధించగా, గ్రూపు-బి నుంచి ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక సూపర్-4 లో అడుగు పెట్టాయి.
ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్, హాంకాంగ్ జట్లు నిష్క్రమించాయి. ఇక శనివారం నుంచి సూపర్-4 దశకు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ సూపర్-4 షెడ్యూల్ ను ఓసారి పరిశీలిద్దాం.
ఆసియా కప్ సూపర్-4 షెడ్యూల్ ఇదే మ్యాచ్ 1: సెప్టెంబర్ 3: ఆప్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక, (షార్జా)
మ్యాచ్ 2: సెప్టెంబర్ 4: భారత్ వర్సెస్ పాకిస్తాన్ (దుబాయ్)
మ్యాచ్ 3: సెప్టెంబర్ 6: శ్రీలంక వర్సెస్ (దుబాయ్)
మ్యాచ్ 4: సెప్టెంబర్ 7: పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ (దుబాయ్)
మ్యాచ్ 5: సెప్టెంబర్ 8: భారత్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ (దుబాయ్)
మ్యాచ్ 6: సెప్టెంబర్ 9: శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్, దుబాయ్
ఫైనల్: సెప్టెంబర్ 11 (వేదిక దుబాయ్)